12-02-2025 09:24:13 AM
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్(India vs England) మధ్య బుధవారం మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Team India captain Rohit Sharma) భారీ రికార్డుకు చేరువయ్యారు. మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో వేగంగా 11 వేల రన్స్ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నమోదు చేయనున్నారు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 259 ఇన్సింగ్స్ ల్లో 10,987 పరుగులు చేశారు. ఇంగ్లండ్ తో జరిగిే మూడో వన్డేలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ రికార్డును సాధించే అవకాశముంది. వన్డేల్లో 11 వేల పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ(Virat Kohli) అగ్రస్థానంలో ఉన్నారు. 222 ఇన్నింగ్స్ ల్లోనే విరాట్ 11 వేల పరుగుల పీట్ ను సాధించారు.