ఆస్ట్రేలియాపై భారత్ ఆధిపత్యం మధ్య, ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా చేరుకున్నారు. అతని భార్య రితికా సజ్దేహ్తో తన రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ భారత్ తోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్టు మ్యాచుకు జన్ ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తున్నారు. ముంబై నుండి పెర్త్‌కు విమానంలో 12 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసిన రోహిత్ కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యాడు. రోహిత్ దిగిన దృశ్యాలు హోటల్ లోపలికి ప్రవేశించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచులో భారత్, ఆస్ట్రేలియాపై పట్టు బిగించింది. ప్రస్తుతం 131 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 465 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (92), నితిశ్ రెడ్డి(26) పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు. ఈ మ్యాచులో భారత్ 513 పరుగుల ఆధిక్యంలో ఉంది.