calender_icon.png 22 January, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చార్టెడ్ ఫ్లుటైలో స్వదేశానికి రోహిత్ సేన

03-07-2024 01:09:42 AM

  • ఘనస్వాగతం పలకనున్న బీసీసీఐ 
  • భారత ఆటగాళ్లను కలవనున్న ప్రధాని మోదీ

బార్బడోస్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించిన రోహిత్ సేన నేడు సగర్వంగా స్వదేశానికి తిరిగి రానుంది. ప్రపంచకప్ ముగిసి మూడు రోజులు అయినప్పటికీ బెరిల్ హారికేన్ ప్రభావంతో మన ఆటగాళ్లు బార్బడోస్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రత్యేక చార్టెడ్ ఫ్లుటైలో టీమిండియా ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం సాయంత్రం చార్టెడ్ విమానం ఎక్కనున్న భారత బృందం బుధవారం సాయంత్రానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. పరిస్థితిని బట్టి భారీ ర్యాలీ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్‌ను సాధించిన రోహిత్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా కలుసుకోనున్నారు.  దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పీఎంవో కార్యాలయం విడుదల చేయనుంది.