- నెట్స్‌లో సాధన చేస్తుండగా తాకిన బంతి
- బాక్సిండ్ డే టెస్టు ఆడేది అనుమానమే..
మెల్‌బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ మోకాలికి గాయమైంది. సపోర్ట్ స్టాఫ్ విసిరిన బంతి రోహిత్ ఎడమ మోకాలికి గాయం చేసింది. గాయం తీవ్రత గురించి ఇంకా తెలియదు. భారత్ ప్రాక్టీస్‌కు సమకూర్చిన ప్రాక్టీ స్ పిచ్‌లపై జట్టు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మెల్‌బోర్న్ పిచ్ బౌన్స్‌కు పెట్టింది పేరు.. కానీ ఆస్ట్రేలియా సమకూర్చిన ప్రాక్టీస్ పిచ్‌లపై బంతి ఏ మాత్రం బౌన్స్ కావడం లేదట.