calender_icon.png 17 November, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి టెస్టుకు రోహిత్!

17-11-2024 12:00:00 AM

ముంబై: తన భార్య ప్రసవం కారణంగా తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉంటాడని ఇన్ని రోజులు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ పెద్దలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కానీ ప్రస్తుతం రో హిత్ భార్య ప్రసవం పూర్తయింది. దీంతో అతడు అనుకున్న దానికంటే ముందుగానే ఆ సీస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే కను క జరిగితే అతడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆడడం పక్కా అని అంతా చర్చించుకుంటున్నారు. ‘తాము నలుగురం అయ్యాం’ అని రోహిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.