న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడితే బాగుంటుందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 19 సంవత్సరాల యువ క్రికెటర్‌ను తీసుకొచ్చినా ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీని ఓడించలేరన్నాడు. ఇక కెప్టెన్ రోహిత్‌లో క్రికెట్ ఇంకా మిగిలే ఉందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపాడు. ‘ఫిట్‌నెస్, ఫామ్ విషయంలో రోహిత్, కోహ్లీ అంచనాలను అందుకోకపోతే యువకులకు అవకాశం ఇవ్వడం కరెక్ట్. ప్రస్తుతం ఈ ఇద్దరు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. ఆ అవసరం ఇప్పుడు లేదు. సెలెక్షన్స్ సమయంలో ఒక ఆటగాడు పరుగులు చేస్తున్నాడా.. ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే విషయం మాత్రమే చూస్తారు. అక్కడ పరుగులతో పాటు ఫామ్ ప్రామాణికం. కోహ్లీ, రోహిత్ మరికొన్నాళ్ల పాటు ఆడతారు’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.