calender_icon.png 13 January, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్రిగ్స్ వీరవిహారం

13-01-2025 12:12:59 AM

  1. రెండో వన్డేలో భారత్ విజయం

రాణించిన మంధాన, హర్లీన్

దీప్తి శర్మకు మూడు వికెట్లు

రాజ్‌కోట్: సొంతగడ్డపై వరుస సిరీస్ విజ యాలతో భారత మహిళల జట్టు దూసుకుపో తోంది. ఇటీవలే వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2 సొంతం చేసుకుంది. ఆదివారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 116 పరుగుల తేడాతో ఘన విజయం సా ధించింది. తొలుత బ్యాటిం గ్ చేసిన మంధాన సేన 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోరు చేసింది.

జేమిమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా.. మంధాన (73), హర్లీన్ డియోల్ (89), ప్రతీక రావల్ (67) అర్థశతకాలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా, అర్లీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. వికెట్ కీపర్ కౌల్టర్ రిలే (80) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సారా ఫోర్బ్స్ (38) పర్వాలేదనిపించింది.

భారత బౌలర్లలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టింది. తన కెరీర్‌లో 40 వన్డేలు ఆడిన రోడ్రిగ్స్ ఇప్పటివరకు ఆరు అర్థసెంచరీలు సాధించింది. తాజాగా కెరీర్‌లో తొలి శతకం అందుకున్న రోడ్రిగ్స్ వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. తొలి స్థానంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగుతోంది. ఇక వన్డేల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.