calender_icon.png 15 March, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నీ సమస్యలకు కామినేనిలో రోబోటిక్ చికిత్స

15-03-2025 12:12:41 AM

రోబోటిక్ సర్జన్ డాక్టర్ వీ సూర్యప్రకాశ్ 

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): కిడ్నీ సమస్యలన్నింటికీ కామినేని ఆస్పత్రిలో అత్యాధునికమైన రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆస్పత్రి యూ రాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వీ సూర్యప్రకాశ్ చెప్పారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక ప్రత్యేక ప్యాకేజీని ఆవిష్క  మాట్లాడారు.

అధిక రక్తపోటు, మధు  నొప్పినివారణ మందులను అతిగా వాడటం, జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్, మాంసాహారాలు ఎక్కువగా తీసుకో  వంటి కారణాల వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. కామినేని ఆస్పత్రిలోనే రోజుకు సుమారు 40 మంది వరకు కిడ్నీ సంబంధిత సమస్యలతో వస్తున్నారని చెప్పారు.

ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కలిపి ఉన్న ఆరుగురు సీనియర్ వైద్య నిపుణులు వీరిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన చికిత్సలు అందిస్తున్నా భు కిడ్నీలు విఫలమై నవారికి అన్నిరకాల డయాలసిస్ సదుపాయాలు ఉన్నాయన్నారు. జీవన్ మృతుల నుంచి అవయవాలు సేకరించి మార్పిడి చేసే కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగు తున్నాయన్నారు. గడిచిన 20 రోజుల్లోనే ఐదుగురికి కిడ్నీలు మార్చినట్టు తెలిపారు.

లైవ్ డోనార్ సర్జరీలు అయితే దాతకు కూడా లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేస్తున్నామన్నారు. సీఎంఆర్ రోబో అనే అత్యాధునిక రోబో సాయంతో రోబోటిక్ శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ చేస్తున్నామన్నారు.

వేసవిలో తగినంత నీరు తీసుకోకపోతే శరీరంలో క్రిస్టల్స్ ఏర్పడి, అవి చివరకు కిడ్నీల్లో రాళ్లుగా మారుతాయన్నారు. రోజుకు రెండు లీటర్ల మూత్రవిసర్జన జరిగేలా నీళ్లు తాగాలని రోగులకు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, డాక్టర్. విష్ణువర్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.