calender_icon.png 1 November, 2024 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్‌లో రోబోటిక్ సర్జరీ

28-04-2024 02:28:24 AM

అరుదైన వ్యాధికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు

హైదరాబాద్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): రెట్రోపెరిటోనియల్ ఫైబ్రోసి స్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సూడాన్‌కు చెందిన మహిళ మహమ్మద్ ఫాగిడా(61)కు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విజయ వంతంగా రోబోటిక్ శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. మూత్రనాళాల్లో అవరోధం ఏర్పడి కిడ్నీలు ఫెయిల్ కాగా మెడికవర్ యూరాలజిస్ట్ డాక్టర్ ఏవీ రవికుమార్ సర్జరీ ద్వారా నయం చేశారు. సంప్రదాయంగా నిర్వహించే ఓపెన్ సర్జరీ పెద్ద సవాలుతో కూడుకున్నదని, అందుకే రోబోటిక్ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు. అధునాతన సాంకేతికతో కూడిన రోబో టిక్స్ సర్జరీల్లో అనుభవజ్ఞులైన వైద్యులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ మధుసూధన్‌రెడ్డి, డాక్టర్ పార్థశ్రీ పాల్గొన్నారు.