27-04-2025 12:00:00 AM
యశోద హాస్పిటల్స్‌లో స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్
హైదరాబాద్, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్న ‘స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్-2025’ రెండు రోజుల ఇంటర్నేషనల్ సమ్మిట్, లైవ్‌వర్క్‌షాప్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రిస్టినా జెడ్ చోంగ్తు మాట్లాడుతూ.. బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ న్యూరో సర్జరీ, న్యూరో ఎండోస్కోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చక్కని వేదిక అవుతుందన్నారు. యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్, స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ కన్వీనర్ డాక్టర్ ఆర్ అయ్యదురై మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ దేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ ‘స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ లైవ్ వర్క్ షాప్ అని అన్నారు.
మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్త్రచికిత్స యొక్క భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుందని, బ్రెయిన్ సర్జరీలను విజయవంతం చేస్తుందన్నారు. యశోద హాస్పిటల్స్ రోబోటిక్ న్యూరో సర్జరీ సెంటర్ భారతదేశంలో ఇదే మొదటిది అని అన్నారు.
దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి వచ్చే న్యూరోసర్జన్లకు ధృవీకరించబడిన శిక్షణా కేంద్రం గా కూడా యశోద ముందంజలో ఉంటుందని డాక్టర్ అయ్యదురై అన్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ‘స్కల్ బేస్ ఎండోస్కోపీ ఇంటర్నేషనల్ సమ్మిట్ అనేది ఎండోస్కోపిక్ ట్రాన్స్ ఆర్బిటల్ విధానంలో మరొక మైలురాయి అని, ఈ సమ్మి ట్‌లో ఎండోస్కోపిక్ స్కల్ బేస్ అనాటమీ సంక్లిష్ట చికిత్సలు, వైద్య రంగంలో సవాళ్లు పంచుకోవడానికి వేదికగా నిలిచిందని అన్నారు.
రోబో సహా యంతో ఎండోస్కోపీ పిన్ హోల్స్ సర్జరీ ద్వారా లోతైన బ్రెయిన్ ట్యూమర్‌ను ఎంతో ఖచ్చితత్వం తో, పూర్తి సురక్షితంగా, విజయవంతంగా తొలిగించడానికి వీలవుతుందని డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరో-సర్జరీ బృందం, 500 మందికి పైగా న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రఖ్యాత న్యూరో వైద్య నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు.