వివరాలు వెల్లడించిన వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోనే మొట్టమొదటిసారిగా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీలో రోబోటిక్ సర్జరీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి తెలిపారు.
బుధవారం జ్యోతి ప్రజ్వలన చేసి రోబోటిక్ సర్జరీ వివరాలను వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటి జయసుధ హాజరయ్యారు. ఆమెమాట్లాడుతూ.. తక్కువ సమయంలో, తక్కు వ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించేందుకు రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రీతిరెడ్డి మాట్లాడు తూ.. మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో మల్లారె డ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్‌తో కొత్త కోర్సును సైతం అందు బాటులోకి తెస్తామని తెలిపారు.