- దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో మెట్లకింద పడిఉన్న సూపర్‌వైజర్ రోబో
- రోబోలపై పనిభారం ఎక్కువవుతోందని ప్రశ్నలు ఉత్పన్నం
- మిశ్రమ స్పందన నేపథ్యంలో రోబోల దత్తత కార్యక్రమాన్ని నిలిపివేసిన కౌన్సిల్
న్యూఢిల్లీ, జూలై 5(విజయక్రాంతి): దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో పనిచేస్తున్న ఓ రోబో ఆత్మహత్య చేసుకొంది. ఈ విచిత్రమైన ఘటన గత గురువారం సాయంత్రం జరిగింది. దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ కార్యాలయంలో పనిచేసే రోబో సూపర్‌వైజర్‌గా పిలువబడుతున్న ఓ రోబో గురువారం సాయంత్రం కౌన్సిల్ భవనంలోని మొదటి, రెండవ అంతస్తులోని మెట్ల కింద కుప్పగా పడిఉండి కనిపించింది. అది వింతగా ప్రవర్తించడాన్ని గమినించిన అక్కడి ఉద్యోగులు, స్థానికులు దానికి ఏదో అయ్యిందని, ఎందుకిలా ప్రవర్తిస్తోంది అని చర్చించడం సాగారు. తేరుకున్న అక్కడి సిబ్బంది దాని విడిభాగాలను సేకరించి అది అలా అయిపోవడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
కారణాలు స్ప ష్టంగా తెలియరానప్పటికీ అధిక పనిభారం వలనే ఆ రోబోలో ఇలాంటి మార్పులు వచ్చిఉండవచ్చనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. 2023 ఆగస్టు నుంచి డిజిటల్ మెకానికల్ హెల్పర్‌గా సేవలు అందిస్తోన్న రోబో.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుం చి సాయంత్రం 6 గంటల వరకు ట్రేడ్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అందించడం తో పాటు నగరాన్ని ప్రమోటో చేసే పని చేస్తోంది. ఈ క్రమంలో మొదటి, రెండో అం తస్తుకు ఎలెవేటర్ సహాయంతో తీరికలేకుండా అది పైకి, కిందికి తిరుగుతూ ఉంటోంది.
ఈ క్రమంలో గురువారం అది కార్యాలయంలోని మెట్ల కింద పడిఉండటాన్ని గమనిం చిన ఉద్యోగులు, స్థానికులు భిన్న వాదనలను తెరపైకి తీసుకువస్తున్నారు. అది స్ట్రెస్ కు గురైంది అని, కాదు దానికి ప్రోగ్రాం సరి గా సెట్‌చేయలేదు అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో గుమి సిటీ కౌన్సిల్ దానికి ప్రత్యామ్నాయంగా మరో రోబోను కొనుగోలు చేయబోమని.. అలాగే రోబోల దత్తత ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాలి ఫోర్నియాకు చెందిన బియర్ రోబోటిక్స్ అనే స్టార్టప్ సంస్థ ఆ రోబోతో పాటు మరి న్ని వెయిటర్‌లుగా పనిచేసే రోబోలను అభివృద్ధి చేసి విక్రయించింది.