న్యూఢిల్లీ, జూన్ 20: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన ఆర్థిక వేత్తల్లో కొందరు వచ్చే బడ్జెట్లో ‘రోబో ట్యాక్స్’ విధింపును ప్రతిపాదించారని సమాచారం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఉపాధి అవకాశాలపై చూపించే అవకాశం ఉందని భావిస్తున్నందున, ఉద్యోగుల నైపుణ్యాన్ని రీస్కిల్ చేసేందుకు అవసరమైన నిధుల్ని సమీకరించడానికి రోబో ట్యాక్స్ ప్రతిపాదనను ఎకానమిస్టులు ప్రతిపాదించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.