calender_icon.png 23 September, 2024 | 3:00 AM

ఆస్ట్రేలియాలో ‘రాబిన్‌హుడ్’ రాగాలు

23-09-2024 12:42:40 AM

హీరో నితిన్ నటిస్తున్న యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ఓ డ్యూయెట్ సాంగ్ షూట్ చేసే పనిలో టీమ్ దిగిపోయింది. కృష్ణకాంత్ లిరిక్స్‌తో జీవీ ప్రకాశ్ సమకూర్చిన స్వరాలతో రూపొందిన ఈ పాటలో నితిన్, శ్రీలీల డాజ్లింగ్ కెమిస్ట్రీ హైలెట్‌గా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

మెల్‌బోర్న్‌లో అద్భుతమైన ప్రదేశాల్లో షూట్ చేస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటే కాకుండా బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌తో సహా ప్రధాన నటీనటులతో కూడిన ముఖ్యమైన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్; ఎడిటింగ్: కోటి; ఆర్ట్ డైరెక్షన్: రామ్‌కుమార్.