27-03-2025 12:00:00 AM
‘నితిన్ హీరోగా నటిస్తున్న హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న ర్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా కథానాయకుడు నితిన్, దర్శకుడు వెంకీ, నిర్మాత వై రవిశంకర్ మీడియాతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. “రాబిన్‌హుడ్’ ఫైనల్ కాఫీ చూశాం. కాన్ఫిడెంట్‌గా అనిపించింది. -నా క్యారెక్టర్ ఇందు లో వెరీ బిగ్ మానిప్లేటర్. చాలా స్మార్ట్ మైం డ్. తొలిసారి ఇలాంటి పాత్రలో నటించాను. క్ల్లుమాక్స్‌లో నా క్యారెక్టర్ చుట్టూ వచ్చే ట్విస్టు లు, షాకులు చాలా కొత్తగా ఉంటాయి. ఎమోషన్ కూడా ఉంది.
హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది. శ్రీలీలతో ఇది నా సెకండ్ ఫిల్మ్. తను చాలా స్వీట్” అన్నారు. డైరెక్టర్ వెంకీ మాట్లాడుతూ.. ‘-సినిమా అంతా షుగర్ కోట్‌లాగా ఫన్ కొటెడ్‌గా ఉంటుంది. కానీ సోల్ ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. -ఇందులో ఆస్ట్రేలియా ఎపిసోడ్ ఉంది. వార్నర్ క్యామియో అక్కడే షూట్ చేశాం” అన్నారు.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘తొలుత మా ఒక్క సినిమానే రిలీజ్ అనుకున్నాం. కానీ రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇది ఊహించలేదు. అందుకే సోలోడేట్ అని ఫిక్స్ అవ్వకుండా పోటీ తప్పదనే మైండ్ సెట్‌తోనే దిగాలని భావిస్తా. టికెట్స్ రేట్స్ 95 శాతం పాతవే ఉన్నాయి. కొన్ని మాల్స్‌లో మాత్రం స్మాల్ చేంజ్ ఉంటుంది’ అన్నారు.