calender_icon.png 2 April, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది దా సర్‌ప్రైజులో నేను లేను

22-03-2025 12:00:00 AM

నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాలోని ‘అది దా సర్‌ప్రైజు’ పాట కాంట్రవర్శీ గురించి స్పందించారు. ఈ పాటలో హుక్ స్టెప్ గురించి కాంట్రవర్శీ నడుస్తోంది. ఈ పాట షూట్‌లో తాను పాల్గొనలేదని.. అయితే దీని విషయంలో ప్రశంసలు, విమర్శలను మాత్రం తాను స్వీకరిస్తున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. “ఆ పాటలో నేను లేను. పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే స్టెప్పుల విషయంలో మాత్రం కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తున్నాం.

ఇదెక్కడ ముగుస్తుందో తెలియదు కానీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. షూట్‌లో లేను కానీ సినిమా చూశాను. సినిమా మంచిగా వచ్చిందనే ఆనందంలో ఉండటంతో సాంగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ట్రోల్స్ చూసిన తర్వాతే నాకు కూడా స్టెప్ గురించి అర్థమైంది” అని నితిన్ తెలిపాడు. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. ‘అది దా సర్‌ప్రైజు’ పాటలో కేతికా శర్మ స్టెప్పులేసింది. ఈ స్టెప్పులపై శేఖర్ మాస్టర్‌పై ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.