calender_icon.png 14 March, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లీన్, ఆర్గానిక్ కామెడీగా రాబిన్‌హుడ్

13-03-2025 01:10:20 AM

హీరో నితిన్, శ్రీలీల జం టగా నటించిన కామెడీ ఎం టర్ టైనర్ రాబిన్‌హుడ్. వెం కీ కుడుముల దర్శకత్వం వ హించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సి ద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. “నా బర్త్ డే మార్చ్ 30.

ఈ సినిమా వచ్చేది మార్చి 28. డైరెక్టర్ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. నే ను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్ గారు వెన్నెల కిషోర్ మా సీన్స్ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్, ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు” అన్నారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.. “ నా క్యారెక్టర్ పేరు మీరా. చాలా స్పెషల్. 

ఇందులో ప్రతి ఎలిమెంట్ చాలా నచ్చింది. మైత్రీ మేకర్స్‌తో వర్క్ చేయ డం గ్రేట్ ఎక్స్ పీరియన్స్‌”అని తెలిపింది. వెంకీ కుడుముల మాట్లాడుతూ.. “సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా ను. నా బెస్ట్ వర్క్ ఇదే. చాలా టైం దొరికింది. ఇందులో మంచి ఫన్ ఉంది. మీరు సర్‌ప్రైజ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి” అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... “వెంకీ కుడుముల ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు.

ఎంటర్టున్మైంట్ ని నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఇంత క్లీన్ ఎంటర్టున్మైంట్ ఉన్న సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతమైన కథతో ఎంటర్టున్మైంట్ మిక్స్ చేసిన సినిమా ఇది” అన్నారు. నిర్మాత వై రవిశంకర్  మాట్లాడుతూ.. “నితిన్, శ్రీలల కాంబినేషన్ స్క్రీన్ పై ముచ్చటగా ఉంటుంది. రాజేంద్రప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా చాలా హిలేరియస్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇరగదీశారు” అన్నారు.