న్యూఢిల్లీ, మే 13: దేశరాజధానిలోని రద్దీగా ఉండే ప్రాంతంలో దోపిడీ దొంగలు ఓ నగల దుకాణం గోడకు డ్రిల్‌తో రంధ్రం చేసి మరీ నగలు, నగదు దోచుకెళ్లారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పట్టుకెళ్లటం విశేషం. మనీహీస్ట్ వెబ్‌సిరీస్‌ను తలపించిన ఈ దోపిడీ చాందినీ చౌక్‌లోని దరిబా కలామ్ మార్కెట్లో జరిగింది. ఈ షాపు పక్కనే మరో మూతపడిన దుకాణం ఉండటంతో అటువైపు నుంచి గోడకు కన్నం వేసిన దొంగలు.. దర్జాగా లోపలికి ప్రవేశించి 14 కిలోల వెండి నగలు, రూ.లక్ష నగదు దోచుకెళ్లారు. ఈ దుకాణం చాలా పాతది కావటంతో గోడలకు రంధ్రంచేయటం తేలికైందని పోలీసులు తెలిపారు.