calender_icon.png 19 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షేక్‌పేట్‌లో దొంగల బీభత్సం

19-03-2025 01:18:57 AM

ఇంటి తాళాలు పగుల గొట్టి 34తులాల బంగారం, రూ.4లక్షలు చోరీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18(విజయక్రాంతి) : ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. డైమండ్ హిల్స్‌లోని మెజాహిత్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగుల గొట్టి, బీరువాను పగుల గొట్టారు. బీరువాలోని 34తులాల బంగారం, రూ.4.5లక్షల నగదు, 550కెనడియన్ డాలర్లను చోరీ చేశారు.

ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మొజాహిత్ రంజాన్ నెల కావడంతో బంధువుల ఇంటికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా మెజాహిత్ ఇంట్లోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను దుండగులు  ఎత్తుకెళ్లడం గమనార్హం.