29-04-2025 09:53:00 AM
అమరావతి,(విజయక్రాంతి): అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ జరిగింది. అమరావతి ఎక్స్ ప్రెస్ లైన్ క్రియర్ కోసం నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు గుత్తి వద్ద ఆగింది. దీంతో సోమవారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఆగి ఉన్న రైలులోని 10 బోగీల్లో ఐదుగురు దుండగులు చొరబడారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను కూడా దోపిడి చేశారు. ఈ దోపీడీ ఘటనపై బాధిత ప్రయాణికులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.