07-04-2025 08:47:12 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్(Duronto Express Train) రైతులో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దొంగలు రూ. 8 లక్షల విలువైన ఆభరణాలు అపహరించారు. మహారాష్ట్రకు చెందిన విశ్రాంత ఉద్యోగుల దంపతుల వద్ద బంగారం చోరీ జరిగింది. హ్యాండ్ బ్యాగులో ఉన్న 15 తులాల బంగారం వజ్రా భరణాలను దుండగులు చోరీ చేశారు . గమనించిన బాధితులు సికింద్రాబాద్ జీఆర్ పీ పోలీసులను(Secunderabad GRP Police) ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.