12-02-2025 12:08:26 AM
మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
నిజామాబాద్ ఫిబ్రవరి 11 (విజయ క్రాం తి) : ఒక మహిళ కళ్లలో కారం కొట్టి గొలు సును చోరీకి ఎత్నించిన మరో మహిళను స్థానికులు వెంబడించి పట్టుకొని చితకబా దిన సంఘటన బోధన్ పట్టణంలోని శంకర్‌నగర్‌లో జరిగింది. మంగళవారం ఉదయం స్థానికంగా ఉండే స్వప్న ఇంట్లోనే చీరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది.
శోభ అనే మరో మహిళ చీరలు కొన్ని నేర్పంతో ఇంట్లోకి వెళ్లి చీరలు చూపించమని అడిగింది. కొద్ది సమయం చీరలు కొంటున్నట్టు నమ్మించి నాటకం ఆడిన మహిళ తన వెంట తెచ్చిన కారంపొడిని స్వప్నపై చెల్లింది.
అనంతరం ఆమె మెడలోని చైన్ లాగేందుకు యత్నించి కౌంటర్‌లో ఉన్న నలభై వేలు నగదుతో పారిపోతుండగా జరిగిన హఠాత్ సంఘటనతో బెంబేలెత్తిన స్వప్న గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి చోరీకి పాల్పడ్డ మహిళను పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు మహిళ చెపుతుండ డంతో ఆగరం చెందిన స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకట నారాయణ తెలిపారు.