calender_icon.png 3 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావిరాల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ

02-03-2025 10:13:07 AM

నాలుగు నిమిషాల్లో ఏటీఎం లూటి

సుమారు రూ.30 లక్షలతో పరారైన దొంగలు

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): ఏటీఎంను ధ్వంసం చేసి సుమారు రూ.30 లక్షల డబ్బును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఎస్బిఐ ఎటిఎం వద్దకు ఓ షిఫ్ట్ కార్ లో వచ్చిన నలుగురు దొంగలు. ముందుగా సిసీ కెమెరాలకు స్ప్రే కొట్టి, ఎమర్జెన్సీ సైరన్ మ్రోగకుండ సెన్సార్  వైర్లను కట్ చేశారు. కట్టర్ ఇనురాడ్ల సహాయంతో ఏటిఎం ను బద్దలు కొట్టి, 4 నిమిషాల్లో ఏటిఎంలో నుండి డబ్బును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి, ఏసిపి కేపీవి రాజు, ఆదిభట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఏటిఎం ను పరిశీలించారు. ఏటిఎం లో సుమారు రూ.30 లక్షల ఉన్నట్టు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. కాగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.