calender_icon.png 30 October, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకీతో బెదిరించి దోపిడీలు

30-08-2024 01:58:17 AM

ఇద్దరు బీహారీ దొంగల అరెస్టు

రాజేంద్రనగర్, ఆగస్టు29: తుపాకీతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన ఇద్దరి ముఠాను గురువారం రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహ్మద్ ముజాహిద్, మహమద్ దిల్బర్, మహ్మద్ షా నవాజ్ ఉప్పర్‌పల్లిలోని హ్యాపీహోమ్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరు అర్ధరాత్రి బైకులపై వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసి, తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారు.

ఇటీవల ముఠా బండ్లగూడ, ఉప్పర్‌పల్లిలో ఇద్దరు ద్విచక్రవాహనదారులను ఆపి తుపాకీతో బెదిరించారు. వారి నుంచి రూ.11 వేల అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1, ఏ2 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కంట్రీమేడ్ తుపాకీతో పాటు కొంత నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.