calender_icon.png 19 January, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్జించు హైడ్రా.. గాండ్రించు హైడ్రా!

01-09-2024 01:17:03 AM

వీడియోను పోస్టు చేసిన తెలంగాణ కాంగ్రెస్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోతోంది. పక్కనున్న ఏపీకి సైతం పాకింది. అక్కడ కూడా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్నవారిలో హైడ్రా వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా రోజూ ఏదోచోట కూల్చివేస్తోంది. చెరువులు, నాళాలు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు సీఎం రేవం త్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాపై సర్వ త్రా చర్చ జరగుతోంది.

ఈ క్రమంలోనే హైడ్రా పనితీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోనే టీ కాంగ్రెస్ రెండు నిమిషాల వ్యవధి కలిగిన ఓ వీడియో ను ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘గర్జించు హైడ్రా.. గాండ్రించు హైడ్రా’ అంటూ కూల్చివేతల సీన్లను అందులో పోస్ట్ చేసింది. సొంత కుటుంబం సైతం హైడ్రాకు అతీతం కాదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారని ఈ వీడియోలో టీ కాంగ్రెస్ తెలిపింది.