వెల్దండలో రోడ్డుపై బైటాయించి ధర్నా చేపడుతున్న విద్యార్థులు
కల్వకుర్తి, నవంబర్ 12: ఉడికి ఉడకని అన్నం తినలేక అర్ధాకలితో అలమటిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని వార్డెన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వెల్దండ బీసీ హాస్టల్ విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
హాస్టల్‌లో 120 మంది విద్యార్థులకు రెండే బాత్రుంలు ఉండటంతో చాలా ఇంబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలు వార్డెన్‌కి చెప్పుకుందామంటే అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. దోమలబెడద, చలికి వనుకుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనికరం చూపడం లేదన్నారు. వారికి మద్దతుగా పీడీఎస్‌యూ నేతలు పాల్గొని మాట్లాడారు.