* హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో అధికభాగం పార్కులు, రహదారుల కబ్జాలు అవుతున్నట్లు ప్రజలు దరఖాస్తుల్లో చెబుతున్నారని, లే ఔట్ ప్రకారం రహదారులుండేలా చూడాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయి.
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలించి.. దశాబ్దం క్రితం ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నారు. ఈ ఫిర్యాదులపై అక్క హైడ్రా అధికారులతో చర్చించి హైడ్రా కమిషనర్ చర్యలకు ఆదేశించారు. చందానగర్ సర్కిల్ 21లోని మాతృశ్రీనగర్‌లో పార్కు కొంత భాగాన్ని, పార్కులో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను కబ్జా చేశారంటూ ఫిర్యాదు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, కోహెడలో సమ్మి బాల్ రెడ్డి తమ ప్లాట్లను కబ్జా చేశారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం, కొర్రెముల్ గ్రామ పంచాయతీలో తమ ప్లాట్లను నల్ల మల్లారెడ్డి కబ్జా చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు తదితర కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.