11-03-2025 12:12:34 AM
ఆందోల్ మార్చి 10 : వట్‌పల్లి మండలం నాగులపల్లి నుండి వట్ పల్లి ప్రధాన రోడ్డు సమాక్క సారలమ్మ ముందు గల రోడ్డు గత పది సంవత్సరాలుగా గుంతల మయంగా ఉండి వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. సుమారు కిలోమీటర్ పొడుగునా మట్టి రోడ్డు ఉండడంతో గ్రామస్తులు మండల నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే అధికారుల అప్రమ త్తమై రోడ్డు వేశారు.
మండల నాయకులు గ్రామస్తులు రోడ్డు పనులు జరగడం చూసిమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోష్ , నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ నారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ నాగరత్నం అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు చంద్ర రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు రవీందర్ కళ్యాణ్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈశ్వరయ్య ,గ్రామ అధ్యక్షులు మనెయ్య, ఉప అధ్యక్షులు బాబూమియ, మైనార్టీ నాయకులు మైరాజ్ ,ఇష్మయీలు, రాజు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేశారు.