calender_icon.png 9 October, 2024 | 11:02 AM

587 రోడ్లు తెగిపోయాయి: ఆర్‌అండ్‌బీ శాఖ

04-09-2024 01:17:56 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 587 రహదారులు తెగిపోయినట్లు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున అంచనాలు మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాడైన రహదారుల తాత్కాలిక మరమ్మతులకు రూ. 256 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.1200 కోట్లు అవసరమని తాత్కాలికంగా అంచనా వేశామన్నారు. వరదల వల్ల నష్టపోయిన రహదారుల సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నందున అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది.