పటాన్‌చెరు-దౌల్తాబాద్ రహదారిపై గుంతలు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు
పటాన్‌చెరు, సెప్టెంబర్ 26: ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని పటాన్‌చెరు-దౌల్తాబాద్ ప్రధాన రహదారి గోతులమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎంఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్‌కు వెళ్లేందుకు ఈ రహదారి అత్యంత కీలకం.
నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో పటాన్‌చెరు నుంచి పెద్ద కంజర్ల వరకు రహదారి విస్తరణ, మరమ్మతుల కోసం హెచ్‌ఎండీఎ 22 కోట్ల రూ పాయలు కేటాయించి టెండర్లు పిలిచింది. సకాలంలో పనులు ప్రారంభం కాకపోవడం.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం రావ డంతో నిధులలేమి పేరుతో కేటాయించిన నిదులను హెచ్‌ఎండీఎ రద్దు చేసింది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డుపై గుంతలు పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పజాప్రతినిధులు, అధికారులు స్పం దించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈవిషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. సంబంధిత రహదారి మరమ్మతుల కోసం ఇటీవల కలెక్టర్ వల్లూరి క్రాంతి రూ.5 లక్షలు కేటాయించారని.. ఇప్పటికే గుంతలను పూ డ్చేందుకు టెండర్లు ఆహ్వానించామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.