11-03-2025 09:03:33 PM
గ్రీన్ పార్కు కాలనీలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ చీఫ్ భాస్కర్ రెడ్డి(ENC), కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి పర్యటన...
ఎల్బీనగర్: లింగోజిగూడ డివిజన్ పరిధిలో బాక్స్ డ్రైన్ పనులు పూర్తయినా రోడ్డు మరమ్మతులు, సిల్ట్ లిఫ్టింగ్ పనులు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదుతో మంగళవారం గ్రీన్ పార్క్ కాలనీలో పర్యటించారు. 30 ఫీట్ల రోడ్డు నిర్మాణం, బాక్స్ డ్రైన్ పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ చీఫ్ భాస్కర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ నాయకులు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. బాక్స్ డ్రైన్ పనులు పూర్తయినా తరువాత మిగిలిన రోడ్డు పనులు, సిల్ట్ లిఫ్టింగ్ పనులు పూర్తి చేయలేదన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాక్స్ డ్రైన్ పక్కన నిలిచిపోయిన రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. శంకేశ్వర్ బజార్ దగ్గర వరద కాల్వ పనులు పూర్తి చేసి, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది గురికాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రవిచంద్, ఏఈ విజయ్ కుమార్, నాయకులు సుధీర్ రెడ్డి, ప్రవీణ్ కాలనీ సభ్యులు జగన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కాశీనాథ్ గౌడ్, సుధాకర్, మధుసూదన్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.