calender_icon.png 24 October, 2024 | 11:56 PM

రహదారి విస్తరణ పనులు షురూ

09-07-2024 03:39:47 AM

  • ఎన్‌హెచ్ 161బీ నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు 
  • నిజాంపేట నుంచి బీదర్‌కు జాతీయ రహదారి నిర్మాణం 
  • మంజీరా నదిపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం

సంగారెడ్డి, జూలై 8 (విజయక్రాంతి): వాహనదారులకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.512. 98 కోట్లతో 161వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టింది. సంగారెడ్డి, నాందే డ్, అకోలా మీదుగా నిజాంపేట నుంచి బీదర్ వరకు 54 కిలోమీటర్ల మేర ఈ డబు ల్ లైన్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. నిజాంపేట రోడ్డును 161బీ జాతీయ రహ దారిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే నారాయణఖేడ్ పట్టణంలో రోడ్డు నిర్మా ణం కొరకు భూసేకరణ పూర్తయింది. నిజాంపేట, నారాయణఖేడ్, మనూర్, న్యాల్‌కల్ మీదుగా రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ. 303 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. జాతీయ రహదారి నిర్మాణంతో పాటు టోల్ గేట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేశారు. ఎట్టకేలకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వాహనదారులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

నిజాంపేట నుంచి బీదర్ వరకు.. 

నిజాంపేట నుంచి బీదర్ వరకు 161బీ జాతీయ రహదారిగా కేంద్రం ప్రభుత్వం గుర్తించి నిధులు మంజూరు చేసింది. సంగారెడ్డి అకోలా 161వ నంబర్ జాతీ య రహదారికి అనుసంధానంగా ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ప్రధాని మోదీ 2013 మార్చి 11న వర్చువల్‌గా ఈ జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. పులుకుర్తి రాఘవపూర్ శివారు మధ్య మంజీరా నది ఉండడంతో బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నారాయణఖేడ్, మనూర్, ఇబ్రహీంపూర్, చాల్కి చౌర స్తా, న్యాల్‌కల్  గ్రామాల పక్క నుంచి  రోడ్డు నిర్మాణం చేపట్టారు. తెలంగాణలో 45.96 కిలోమీటర్లు, కర్ణాటకలోని బీదర్ తాలుకా పరిధిలో 7.4 కిల్లోమీటర్ల మేర రోడ్డు నిర్మా ణం చేస్తున్నారు. నిజాంపేట, ర్యాలమడుగు, వెంకటపూర్, బాణాపూర్, పిప్రి, మనూర్, బెల్లాపూర్ పుల్‌కుర్తి, హుమ్నాపూర్, ఇబ్రహీంపూర్, న్యాల్‌కల్, డప్పూర్ మీదగా కర్ణా టకలోని సూల్తాన్‌పూర్ నుంచి బీదర్ రింగ్ రోడ్డు వరకు నిర్మాణ పనులు చేపట్టారు.   

మంజీరా నదిపై కొత్తగా బ్రిడ్జి 

పుల్‌కుర్తి, శివారు మధ్య మంజీరా నది ఉండడంతో బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పుల్‌కుర్తి  నుంచి రాఘవపూర్ శివారులో ఉన్న పంచవాటి క్షేత్రం పక్క నుంచి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. పంచవాటి క్షేత్రం నుంచి ఇబ్రహీంపూర్ వరకు రోడ్డు పనులు ప్రారంభించారు. మంజీరా నదిపై ఇప్పుటికే బ్రిడ్జి ఉన్నందున.. మరో బ్రిడ్జి నిర్మాణం చేయడం ద్వారా వాహనదారులకు మరింత సౌకర్యం కలుగనుంది.  

టోల్ గేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

నిజాంపేట నుంచి బీదర్ వరకు నిర్మిస్తున్న 161బీ జాతీయ రహదారిపై పుల్‌కుర్తి గ్రామాల మధ్య టోల్ గేట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనాలు సిద్దం చేశారు. కొత్తగా నిర్మాణం చేస్తున్న జాతీయ రహదారిపై బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణం చేసేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.  

గడువులోగా పూర్తి చేస్తాం..

161బీ జాతీయ రహదారి నిర్మా ణం చేసేందుకు ప్రభుత్వం రూ. 303 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్లు వేసి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. న్యాల్‌కల్ మండలంలో జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం భూసేకరణ చేసి భూమి అప్పగించడంతో పనులు మొ దలుపెట్టాం. మంజీరా నదిపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నాం. వాహనదారులకు అసౌకర్యం కలగకుండా, మలుపులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టాం. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.

 -రామకృష్ణ ఎన్‌హెచ్ డీఈఈ