ఫిర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండారి రవీందర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 17 (విజయక్రాంతి) : ఫిర్జాదిగూడొోపర్వతాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు రవీందర్ ఆరోపించా రు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలలో చేస్తున్న అలసత్వం కారణంగా రూ.26 కోట్ల మేర హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టిన ఫిర్జాదిగూడ 4 లైన్ల రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. నగరంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్డు విస్తరణ చేపట్టాలనే సంకల్పం తో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు.
మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో 4 లైన్ల రోడ్డు విస్తరణకు హెచ్‌ఎండీఏ సుమారు రూ. 26.32 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల అవగాహన రాహిత్యం కారణం గా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేసి ప్రజలకు 4లైన్ రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు త్వరగా విడుదల చేసి పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.