calender_icon.png 19 April, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాకపోకలకు ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలి

19-04-2025 01:38:38 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో ఈటిగడ్డ తండా ఫిల్టర్ బెడ్ కు వెళ్లే దారి గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోగా, తిరిగి కల్వర్టు నిర్మాణం, తెగిపోయిన రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించడానికి పనులు చేపట్టారు. అయితే ఆ ప్రాంత వాసులు రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయ తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని సిపిఎం పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, అప్పటివరకు తాత్కాలిక అప్రోచ్ రోడ్డు వేసి ప్రజలకు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు నిర్మాణ పనులను శనివారం సిపిఎం నాయకులు కుమ్మరి కుంట్ల నాగన్న, యామగాని వెంకన్న, బానోతు ప్రకాష్ తదితరులు పరిశీలించారు.