డీపీఎస్ స్కూల్ ట్రాఫిక్ పార్క్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మేడ్చల్, జనవరి 20 : రోడ్డు భద్రత కాదని.. రోడ్డు బాధ్యత అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నాచారంలోని డీపీఎస్ స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులకు రోడ్డు భద్రత, నిబంధనల గురించి అవగాహన కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సోమవారం ట్రాఫిక్ పార్క్ పేరుతో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీపీఎస్ స్కూల్ చైర్మన్ మల్క కొమురయ్య, డైరెక్టర్లు పల్లవి, యశస్వి,త్రిభువన, సీనియర్ ప్రిన్సిపాల్ సునీత రావు, విద్యార్థులు పాల్గొన్నారు.