జిల్లా రవాణా అధికారి కె. శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌రెడ్డి రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులని హెల్మెట్ ఇచ్చి సత్కరించారు. తదుపరి ప్రసంగిస్తూ రొడ్డు ప్రమాదాలకి అతి ముఖ్యమైన కారణం అతి వేగం,మధ్యపానం చేసి వాహనం నడపటం అని చెబుతు మధ్యం సేవించిన తరువాత ఎదురుగా వచ్చే వాహనాలు గుర్తించి ప్రతిచర్య తీసుకునే సమయం సాధారణ వ్యక్తికన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అని దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం అధికం అని భౌతిక నియమాలు ద్వారా విద్యార్థులకి అర్థమయ్యేలా వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం గీత, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.