calender_icon.png 11 January, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా రోడ్డు భద్రత మాసోత్సవాలు : కలెక్టర్

05-01-2025 12:00:00 AM

నారాయణపేట, జనవరి 4 (విజయ క్రాంతి) : జిల్లాలో రోడ్డు భద్రత మాసొత్స వాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇప్పటికే బ్లాక్ స్పాట్ గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, విద్యాలయాల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిబంధనలు పాటించని వాహన దారుల పై జరిమానాలు వేసేందుకు చర్యలు తీసు కోవాలని పోలీస్, రవాణా శాఖ అధికారు లను ఆదేశించారు. 

రోడ్డు భద్రత మాసొత్సవాలు వాల్ పోస్టర్ విడుదల 

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డిఎస్పీ వేంకటేశ్వర రావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఆర్.టి. ఒ మానస,  పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య, రోడ్లు భవనాలు డి. ఈ సీతారామ స్వామి ఎన్.ఐ.సి. ఐ.ఆర్.ఎ.డి. నుండి మురళీ కృష్ణ తో కలిసి కలెక్టర్ రోడ్డు భద్రత మాసొత్సవాలకు సంబందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.