28-04-2025 01:03:03 AM
నిర్మల్, ఏప్రిల్ 27(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరుగులో మైనర్స్ డ్రైవింగ్ లపై తనిఖీలు నిర్వహించా రు.
అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో సుమారు గా 100 మైనర్స్ డ్రైవింగ్ కేసులు నమోదు, సుమారుగా 100 వాహనాలు, మైనర్లు వారి తల్లిదండ్రులు కలుపుకొని 296 మం దికి పోలీసు అధికారులు అవినాష్ కుమార్, ఏఎస్పీ భైంసా, రాజేష్ మీనా, ఏఎస్పీ నిర్మల్ స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రు లు జాగ్రత్తగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్ద అని వాహన యజమా నులు బాధ్యత వహించాలని, ఈ విషయం తల్లిదండ్రులు గ్రహించాలని అని జిల్లా ఎస్పీ డా .జి.జానకి షర్మిల తెలియజేసారు.
మైనర్స్‌కు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై వాహన చట్ట ప్రకా రం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గత కొద్ది రోజులుగా మైనర్ పిల్ల లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ పోలీసు తనిఖీల్లో పట్టుబడుతున్నారు, పట్టుబడ్డవారికి జరిమానాలు విధిస్తూ కౌన్సెలింగ్ నిర్వ హిస్తున్నామన్నారు, కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నారు.పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
రోడ్డు భద్రత చర్యలు ప్రతిఒక్కరూ పాటించాలి అని కోరారు. యువత అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమా దాల బారినపడి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దుఃఖం పెట్టవద్దు అని కోరారు. పోలీసు జరిమానాలు విధించడం భద్రత చర్యల్లో భాగమని, మార్పుకోసమేనని, వాహనదారులు నిభందనలు ఉల్లంఘించి ఒక సారి జరిమానాకు గురైతే మళ్ళీ అలాం టి తప్పులు చేయవద్దు అని కోరారు. మంగళవారం రెండవ విడత జిల్లా ప్రధాన కార్యా లయంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆధ్వరయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.