* విద్యార్థులు డ్రైవింగ్‌పై జాగ్రత్తలు పాటించాలి
* ప్రమాదాలను అరికట్టేందుకు విద్యార్థుల్లో చైతన్యం రావాలి
మానకొండూర్, జనవరి 2: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని రోడ్డుపై విద్యార్థులు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి డ్రై వింగ్ చేయాలని కరీంనగర్ డీటీవోశ్రీకాంత్ చక్రవర్తి పిలుపునిచ్చారు. 36వ జాతీయర హదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదే శానుసారం కరీంనగర్ ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాల నీ శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ర్థులకు రోడ్డు భద్రత, రాష్ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈనెల 1 నుంచి 31 వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసో త్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఆర్టీవో విజయ పాల్ రెడ్డి విద్యార్థు లకు స్క్రీన్ పై జరిగిన రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరీంనగర్ డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి మాట్లాడుతూ కళాశాలకు వచ్చే విద్యార్థులు తప్పకుండా హెల్మెట్ ధ రించి డ్రైవింగ్ చేయాలని రాష్ డ్రైవింగ్‌తో ఎంతోమంది రోడ్డుపై మృత్యువాత పడుతు న్నారని తెలిపారు.
ఓవర్ స్పీడ్ వల్ల ప్రాణా లతో చెలగాటమని తమ భవిష్యత్తును బం గారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకునే దిశగా ఉన్నత స్థాయికి ఎదిగి ప్రమాదాలను నివారించాలని కోరారు. రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్డు ప్రమాదాన్ని నివారిస్తామని విద్యా ర్థులు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్య క్రమంలో కరీంనగర్ సీనియర్ ఎంవిఐ రవి కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ రాజు, ఏఎంవిఐ హరిత, ఉమ్మడి జిల్లా ఏఎంవి ఐలు నిఖిల్, ప్రదీప్ సాగర్, రియాజ్, వంశీకృష్ణ, పృథ్వీరాజ్, లతోపాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.