calender_icon.png 5 March, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిబంధనలను పాటించాలి

05-03-2025 12:12:39 AM

బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

మందమర్రి, మార్చి 4 (విజయక్రాంతి) : రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ ఆన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాలని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని జాతీయ రహదారి టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 54వ జాతీయ భద్రత వారోత్సవాలలో బాగంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన పెంచి, ప్రమాదాలను నివారించేందుకు 1971లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ సి) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికి గత సంవత్సరం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై 363 రోడ్డు ప్రమాదాలు జరిగి 54 మంది మరణించడం బాధాకరమన్నారు. రాత్రి సమయంలో రహదారులపై వాహనాలు నిలిపి ఉంచడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్ పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్‌ఐ ప్రవీణ్, జాతీయ రహదారి నిర్వహణ అధికారులు సునీల్, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.