వనపర్తి, నవంబర్ 22 (విజయక్రాంతి): ఈ నెల 18వ తేదిన వనపర్తి జిల్లా పెబ్బేర్ పట్టణ సమీపంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దోపడీకి పాల్పడిన ఆరుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్‌రావుతో కలిసి మల్టిజోన్ 2 ఐజీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు.
మహా రాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు నిందితులు పథకం ప్రకారంగా జాతీయ రహదారిపై దారి దోపిడీ చేసేందుకు కాపు కాసి ఉన్నారు. అదే సమయంలో వాహనం ఆగి ఉన్న విషయాన్ని గ్రహించారు. వాహనంపై ఉన్న బ్యాగులు తీసుకుని పరిశీలించగా అందులో ఏమీ లభించలేదు. ఆ తర్వాత కారులో ఉన్నవారిపై రాళ్లతో దాడి చేసి మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నట్టు ఐజీ తెలిపారు.