calender_icon.png 30 November, 2024 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల మరమ్మతులు చేపట్టాలి

30-11-2024 12:29:34 AM

  1. అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం
  2. నిజామాబాద్ కలెక్టరేట్‌లో సమీక్ష

నిజామాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. వచ్చే మే లేదా జూన్ వరకు మాధవనగర్ రైల్వే బ్రిడ్జి పను లు పూర్తి చేయాలని సూచించారు.

అందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నల్లవెల్లి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

దర్పల్లి నుంచి ఇందిరానగర్ విగ్రహం వరకు రోడ్డు పనులకు, నిజామాబాద్‌లో వినాయక్‌నగర్ నుం చి రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దర్పల్లిలో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. అలాగే కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఎన్‌హెచ్ 63, 44ల అనుసంధానంగా కమర్‌పల్లి నుంచి రామారెడ్డి సిరి కొండ భీమ్‌గల్ మీదుగా కామారెడ్డి వరకు రోడ్డు ప్రతిపాదనలు పంపి స్తే ముఖ్యమంత్రి ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి రోడ్డు మంజూరుకు ప్రయత్నిస్తానని కోమటిరెడ్డి చెప్పారు.

ఆయన వెంట జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్‌బీన్ హుందాన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్‌నాయక్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్‌వో వికాస్‌మీనా ఉన్నారు.

రోడ్డును వెంటనే బాగు చేయాలి

నిజామాబాద్ నుంచి అక్కొరా, మోర్తాడ్ మీదుగా నగర్ వరంగల్‌కు వెళ్లే మార్గం లక్కోరా సమీపంలోని జాతీయ రహదారి 63 ధ్వంసమైన విషయాన్ని విజయక్రాంతి దినపత్రికలో శుక్రవారం ‘రహదారులు ఛిద్రం.. రోజుకో ప్రమాదం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్‌హెచ్ 63 మంచిర్యాల పీడీని శుక్రవారం ఆదేశించారు.

సం బంధిత ప్రతిపాదనలు తనకు నివేదించాలన్నారు. నిర్లక్ష్యం  వహిస్తే ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం చేయకూడదని ఆదేశించారు. కాగా వార్త ప్రచురితమైన విజయక్రాంతి పత్రికను మంత్రి తన వెంట తీసుకెళ్లారు.