calender_icon.png 25 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ కింగ్.. తెలంగాణ!

29-07-2024 02:12:33 AM

రాష్ట్రంలో ప్రతి ౧౦౦ చ.కి.మీ.కి  ౯౮.౮ కి.మీ రోడ్లు

జాతీయ సగటు కంటే ఇక్కడే హైవేలు అధికం

అత్యధికం హైదరాబాద్‌లో.. అత్యల్పం ములుగులో 

రాష్ట్ర వ్యాప్తంగా 1,10,756 కి.మీ మేర రోడ్లు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): రోడ్ల విస్తీర్ణంలో తెలంగాణ జాతీయ సగటును మించిపోయింది. నేషనల్ హైవేల జాతీయ సగటు ౨.౭ శాతం ఉండగా, రాష్ట్రం లో అది దాదాపు ౪.౦౬ శాతంగా ఉన్నది. తెలంగాణలోని ప్రతి ౧౦౦ చదరపు కిలోమీటర్‌కు దాదాపు ౯౮.౮ కిలోమీటర్ల రోడ్డు ఉన్నదని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో తేలింది. రాష్ట్రంలో 1,10,756 కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో బ్లాక్ టాప్ (బీటీ) రోడ్లు అత్యధికంగా 59,499 కి.మీ. ఉండగా, సీసీ రోడ్లు 11,438 కి.మీ., మెటల్ రోడ్లు 8,292 కి.మీ., మట్టి రోడ్లు 31,527 కి.మీ. ఉన్నాయి. ఇందులో పంచాయతీరాజ్ రోడ్లు 68,539 కి.మీ. (61.88 శాతం), ఆర్‌అండ్‌బీ రోడ్లు 28,707 కి.మీ. (25.92 శాతం), జీహెచ్‌ఎంసీ రోడ్లు 9,013 కి.మీ., (8.14 శాతం), జాతీయ రహదారులు 4,497 కి.మీ. (4.06 శాతం) ఉన్నాయి. 

హైదరాబాద్‌లో అత్యధికం.. ములుగులో అత్యల్పం 

రాష్ట్రంలో అత్యధిక రోడ్లు ఉన్న జిల్లాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిలిచింది. అతి తక్కువ రోడ్లున్న జిల్లాగా ములుగు ఉంది. హైదరాబాద్‌లో 100 చ.కి.మీ. విస్తీర్ణానికి 1,332.7 కి.మీ. రోడ్లున్నాయి. రెండో స్థానం లో ఉన్న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 385.4 కి.మీ., రంగారెడ్డిలో 158.1 కి.మీ. రోడ్లుండగా.. రాష్ట్రంలో చిట్టచివరన ఉన్న ములుగులో 100 చ.కి.మీ విస్తీర్ణానికిగాను కేవలం 41.3 కి.మీ రోడ్లు మాత్రమే ఉన్నాయి. 

మట్టి రోడ్డు ఎక్కువే..

అయితే, రాష్ట్రంలో మట్టి రోడ్ల విస్తీర్ణం కూడా ఎక్కువే ఉన్నది. బీటీ రోడ్లు ౫౯,౪౯౯ కిలోమీటర్లు ఉంటే ఆ తర్వాత స్థానంలో ౩౧,౫౨౭ కిలోమీటర్లతో మట్టి రోడ్లు రెండో స్థానంలో నిలిచాయి. 

రాష్ట్రంలో రోడ్ల వివరాలు...

రోడ్డు తరహా పొడవు (కి.మీ.లలో) సగటు 

పంచాయతీరాజ్ రోడ్లు 68,539 61.88

ఆర్‌అండ్‌బీ రోడ్లు 28,707 25.92

జీహెచ్‌ఎంసీ రోడ్లు 9,013 8.14

జాతీయ రహదారులు 4,497 4.06

మొత్తం 1,10,756