calender_icon.png 21 April, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

15-04-2025 01:32:49 AM

రూ. 101 కోట్ల 90 లక్షల  రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్‌బాబు

మంథని ఏప్రిల్ ౧4 (విజయ క్రాంతి): రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని  రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని లో పలు గ్రామాలకు రొడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి నాడు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, మంథని పట్టణం పరిసర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించామని అన్నారు.

ఎక్లాస్ పూర్ నుంచి ఖమ్మం పల్లి రహదారి పునరుద్ధరణ పనులను 11 కోట్ల 90 లక్షలతో, ఖమ్మం పల్లి నుంచి ఓడేడు  వరకు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ. 30 కోట్లతో మంథని నుంచి ఓడెడు వరకు 19 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ. 60 కోట్లతో చేపట్టడం జరిగిందని, రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

పగుళ్ల గుట్టలో   రూ. 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు.  నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు జరగాలని, దీనిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని,   యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని, 15 రోజుల్లో  లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రి తెలిపారు.

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.  200 కోట్లతో ఇండియా గురుకులాల నిర్మాణం చేపట్టామని, సోమన్ పల్లి వద్ద రూ. 200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని, గత ప్రభుత్వంలో రైతులు తాలు కట్టింగ్ తో ఇబ్బందులు పడితే మన ప్రజా ప్రభుత్వం కట్టింగ్ కు స్వస్తి పలికి సన్న రకం వడ్లకు క్వింటాళ్ల రూ. 500 రూపాయల బోనస్ అందించామన్నారు.

రూ. 25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 681 కోట్ల రూపాయల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామని, వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి 1800 కోట్ల బోనస్ అందించామని, రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ విడుదల చేస్తుందన్నారు. అనంతరం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి  మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత ఆర్ అండ్ బి ఎస్సీ కిషన్ రావు, ఈఈ భావ్ సింగ్, ఆర్డీవో సురేష్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్,  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మంథని, ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, నాయకులు కుడుదుల వెంకన్న, మంథని సత్యం, శశిభూషణ్ కాచే, నరసింహారావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.