23-03-2025 04:10:12 PM
బిటీ రోడ్లు నాణ్యతతో చేపట్టాలి..
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
జుక్కల్ (విజయక్రాంతి): వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లను నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బంగారు పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దోస్పల్లి సమీపంలో నుంచి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని పనుల్లో నాణ్యత విధానాలు పాటించాలని సూచించారు. జుక్కల్ ప్రజలకు వాహనదారులకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మెరుగైన రోడ్లను నాణ్యతతో ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మాణం పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
రోడ్లు రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు జుక్కల్ మండలం బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపన చేశారు. అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనులు వేగవంతం చేయాలని అదేవిధంగా పనులలో నాణ్యత విధానాలను పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లును నిర్మించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ విండో చైర్మన్ శివ నందప్ప, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్, జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సేటు, రమేష్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.