calender_icon.png 26 October, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి కూలిన రోడ్డు

01-09-2024 05:51:51 PM

కామారెడ్డి, (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రం సమీపంలోని టేక్ రియల్ బైపాస్ చౌరస్తా 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం బ్రిడ్జి సమీపంలో భారీ వరదనీరుకు పెద్ద గుంత ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజాంబాద్, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వైపు వచ్చే వాహనదారుల రాకపోకలకు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు జాతీయ రహదారి అధికారులు ఫోక్లైన్లు తెచ్చి గుంతను పూడ్చి వేశారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు పక్కనే రోడ్డు కొట్టకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కామారెడ్డి పెద్ద చెరువు అలుగులు పారుతున్నాయి. మాచరెడ్డి మండలం పాల్వంచ జోరుగా ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆ నీరు అంతా మిడ్ మానేరు డ్యాంలోకి వెళ్తుంది.

గాంధారి లింగంపేట వాగు నీరు పోచారం ప్రాజెక్టులోకి వెళ్తున్నాయి. సింగితం కళ్యాణి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. తాడ్వాయి మండలంలోని సంతపేట భీమేశ్వర వాగు పొంగి పొర్లుతుంది. జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు జోరుగా ప్రవహిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్, ఆర్బి నగర్, గాంధీనగర్, కాకతీయ నగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో అర్ధరాత్రి వరకు ప్రజలు అవస్థ పడ్డారు. బాన్సువాడ ఎల్లారెడ్డి జుక్కల్ పిట్లం బిచ్కుంద మద్నూర్ నస్రుల్లాబాద్ మండలాల్లో ఇండ్లలోకి వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.