14-02-2025 01:28:06 AM
కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 1౩ (విజయక్రాంతి), 44వ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ ఉన్న ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి కోరారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
44వ జాతీయ రహదారి పైన గత సంవత్సర కాలం నుండి ఇప్పటివరకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించి నేషనల్ హైవే అథారిటీ, జిఎంఆర్,ఆర్, అండ్ బి ,ఏ ఈ, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, ఆర్టీసీ డిఎం ఇందిరా, కామారెడ్డి రూరల్ శ్రీరామన్, బికనూర్ సిఐ సంపత్ కుమార్, బిక్నూర్ ఎస్త్స్ర ఆంజనేయులు దేవునిపల్లి రాజులతో సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకై తగు సూచనలు చేశారు.
వాటితో పాటుగా బ్లాక్ స్పాట్లో ఇకముందు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణకై చేయవలసిన పనుల గురించి ఆదేశాలు ఇచ్చినారు. మిగిలిన పనులను తొందరలో పూర్తి చేయవలసిందిగా సూచించారు.