రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకూ ప్రమాదాలు పెరిగిపోతున్నా యి. అధిక స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది తమ ప్రాణా లు కోల్పోతున్నారు. నిత్యం యాక్సిడెంట్లతో రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ఒక్కోసారి యాక్సిడెంట్లో ఒకరు ఇద్దరు మాత్రమే కా దు.. ఏకంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. అందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు. హెల్మెట్ వాడకపోవడం, అధిక స్పీ డ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్.. ఇలా ప్రతీ రూల్స్‌నూ పెడచెవిన పెట్టేస్తున్నారు.భారత్‌లో దాదాపు ప్రతి మూడున్నర నిమి షాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు .
సగటున ప్రతిరోజూ 1,264 రోడ్డు ప్రమాదాలు, 462 మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలోని రహదారుల పొడవులో జాతీయ రహదారులు కేవలం 2 శాతం మాత్రమే ఉన్నాయని, అయితే మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 30.3 శాతం, మరణాలలో 36శాతం జాతీయ రహదారులు ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది.
రోడ్డు ట్రాఫిక్ మరణాలలో మూడింట రెండు వంతుల మం ది పని చేసే వయస్సు (18-59 సంవత్సరాలు) వ్యక్తులలో సంభవిస్తున్నాయి. మరణిస్తున్న వారిలో దాదాపు 68 శాతం మంది యువతే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ 9 నెలల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 18,991 రోడ్డు ప్రమాదాలు జరిగా యి. అందులో 5,606 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 17,689 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీని బట్టి చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరగ్గా.. 21 మం ది ప్రాణాలు విడిచారు.
గతేడాది కంటే ఈ ఏడాది యాక్సిడెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 2,075 ప్ర మాదాలు ఎక్కువ. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగాయి. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7,168 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,380 మంది ప్రాణాలు విడిచారు. అలాగే దీ ని తర్వాత వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1,027 ప్రమాదాలు జరిగాయి. రహదారి భద్రతను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
దీనికి రవాణా, పోలీసు, ఆరోగ్యం మరియు విద్య, అలాగే ప్రైవేట్ రంగం, పౌర సమాజ సంస్థల వంటి బహుళ రంగాల ప్రమేయం అవసరం. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టకోవడం తప్పనిసరి చేయా లి. కీలకమైన నష్టాలకు సంబంధించిన చట్టాలను ఏర్పాటు చేయడం, అమలు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం తప్పనిసరి చేయాలి. డా. బి. కేశవులు