calender_icon.png 4 February, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెత్తురోడిన చర్ల రోడ్లు..

03-02-2025 11:57:22 PM

రెండు వేరు వేరు ప్రమాదాలు..

చర్ల (విజయక్రాంతి): భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సోమవారం జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లో వెళితే... చర్ల మండలం తిప్పాపురం వద్ద ఎదరెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా 4 గురు గాయాలపాలయ్యారు. జీడిపల్లి, మిడిసిలేరు గ్రామాలకు చెందిన వారు, ఒక వాహనంపై ఇద్దరు, మరో వాహనం ముగ్గురు ప్రయాణిస్తు ప్రమాదానికి గురయ్యారు. క్షతగాత్రులను సత్యనారాయణపురం ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి భధ్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఈ ప్రమాదంలో విజయ కుమార్, కల్మదేవన్, పవన్ కుమారులు గాయాలపాలయిన వారిలో ఉన్నారు.

ఆర్ కొత్తగూడెం వద్ద మరో ప్రమాదం!

చర్ల మండలం ఆర్ కొత్తగూడెం వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. టాటా మ్యాజిక్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. టాటా మ్యాజిక్ భధ్రాచలం నుంచి చర్ల వైపు, ద్విచక్రవాహనదారులు చత్తీస్ఘడ్ నుంచి భద్రాచలం వైపు వెళుతుండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలపాలయ్యారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న చత్తీస్ఘడ్కు చెందిన మడకం మంగు, కోమలి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.