calender_icon.png 4 April, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

03-04-2025 10:49:08 PM

జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): పరిమితి వేగంతో ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వేగంతో రోడ్లపై ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని అన్నారు. అతివేగం మద్యం సేవించి నడపడం ప్రమాదాలకు మూల కారణమని జిల్లా ఎస్పీ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయాల సముదాయంలోని మిని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల ఉన్నత అధికారులతో పాటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిశంకర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ... గత మూడు నెలలో జరిగిన రోడ్డు ఆక్సిడెంట్లను వివరాలను అడిగి తెలుసుకుని వాటికి గల కారణాలను విశ్లేషించారు. కనీస రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించడం ద్వారా జరిగేటువంటి రోడ్ యాక్సిడెంట్లను నివారించవచ్చని తెలియజేశారు. వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనం వేగం ఉండాలని పరిమితికి మించి వాహనాన్ని నడిపినట్లయితే స్పీడ్ గన్  ద్వారా గుర్తించి వారిపై ఫైన్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లను ఇప్పటివరకు గుర్తించినట్లు తెలియజేశారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం వేకువజామున నిద్రలో, రాత్రి 8 గంటల తరువాత,  అతివేగంగా, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అని తెలియజేశారు.

అదేవిధంగా అనుమతించబడిన వేగం వరకే వాహనాలు నడపాలని అతివేగంగా, రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదని తెలియజేశారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని మరియు హెల్మెట్ ను ధరించాలని తెలియజేశారు. ప్రతిరోజు వెహికల్ చెకింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి వాటిని గుర్తించి వారికి జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. మైనర్లకు వాహనాన్ని ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల పైన కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఏదైతే మూలమలుపు కన్న ముందే ఇండికేషన్ రేడియం స్టిక్కర్ అతికించడం వల్ల డ్రైవర్ జాగ్రత్త పడి రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని, రోడ్డు ప్రమాదాల తగ్గించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్, లక్ష్యం పెట్టుకొని  పని చేస్తే తప్పకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు. 

ఇకపై ప్రతి వాహన దారులు  కూడా స్వతహాగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటిస్తూ అదేవిధముగా పరిమితి వేగమును మించకుండా ప్రయాణం చేస్తూ సురక్షితముగ గమ్యములకు చేరే విదముగా ప్రయాణించగలరు. ఇలా చేసినచో తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చేసినవరము అవుతాము అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పి చైతన్య రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటిండెంట్ హన్మంతు రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఇంజనీర్, పంచాయతీ రాజ్ రోడ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.